శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో.. కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్- వైజాగ్ కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టయింది. దుబాయ్ నుంచి వైజాగ్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కిలోన్నర బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం మార్కెట్ విలువ 70 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నిందితులపై బంగారం అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.