ట్రాఫిక్ నిబంధనలు పాటించండని పోలీసులు చెప్పే మాటలు కొంత మంది తూ.చ. తప్పకుండా పాటిస్తారు. మరికొంత మంది మాత్రం అబ్బే... ఏం కాదులే పోలీసులు చూస్తు న్నారా? అన్నట్లు అతిక్రమిస్తారు. కానీ మూడో నేత్రం సీసీ కెమరాలకు చిక్కుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే వరంగల్ సిటీలో ఒకటి చోటు చేసుకుంది. హన్మకొండకు చెందిన అస్లాం అనే వ్యక్తి స్కూటీపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 233 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ బైకర్ ట్రాఫిక్ చలాన్ల చరిత్ర బయటపడింది. సీపీ ఆదేశాలతో తన సిబ్బందిని వెంటేసుకొని రంగంలోకి దిగిన కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న మొత్తం మీద ఆ వ్యక్తిని పట్టు కున్నారు. పెండింగ్లో ఉన్న చలాన్ల మొత్తం జరిమానా రూ.45,350 లుగా ఉండటంతో ఆ జరిమానా కింద వెహికల్ ను స్వాధీనం చేసుకు న్నారు. సంబంధిత వ్యక్తి అంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించి స్కూటీ తిరిగి తీసుకుంటా డా?చూడాలి.