Jangaon: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
Jangaon: జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు.;
Jangaon: జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ పంక్షన్‌కు హాజరవడానికి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తవేరా కారులో వరంగల్
నుండి హైదరాబాద్ వెళుతుండగా.. టైరు పగిలి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులు వరంగల్ చింతల్ నగర్‌కు చెందిన అఫ్రీన్ బేగం, ఫర్జాబ్ బేగం, షౌకత్ హుస్సేన్‌గా గుర్తించారు.