TS Corona : తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు..!
TS Corona : తెలంగాణలో కరోనా కేసులు నాలుగు వేల మార్కుకు చేరువయ్యాయి.;
TS Corona : తెలంగాణలో కరోనా కేసులు నాలుగు వేల మార్కుకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 97వేల 113 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3980 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కోవిడ్‌తో మృతి చెందారు. 2వేల 398 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 33 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పాజిటివ్ కేసులు పెరిగాయి. కేస్ ఫెటాలిటీ రేటు 0.55 శాతం ఉండగా, రికవరీ రేటు 94.89కి చేరుకుంది. ఇంకా 7 వేల 852 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది.