MLA Sriganeesh : కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దాడికి యత్నించిన 50మంది దుండగులు

Update: 2025-07-21 05:15 GMT

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించడం కలకలం రేపింది. మాణికేశ్వర్ నగర్‌లో ఆదివారం రాత్రి బోనాల సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తుండగా, సుమారు 50 మంది దుండగులు దాడికి యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న శ్రీ గణేశ్ ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎంవో ఆరా తీసింది. పూర్తిస్థాయి విచారణ జరపాలన సీపీకి ఆదేశాలు జారీ చేసింది.

వడ్డెర బస్తీలో జరిగే బోనాల ఉత్సవానికి వెళ్తుండగా సుమారు 20 బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు తన వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారని శ్రీగణేశ్ తెలిపారు. తనను కారులో నుంచి కిందకు దిగాలని బెదిరించారని.. అడ్డుకోబోయిన తన గన్‌మెన్ నుంచి ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్ ఓయూ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి వాహనాల నంబర్ల ఆధారంగా ఆరుగురిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి వాకాటి శ్రీహరి ఓయూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో మాట్లాడారు. నిందితులను విదిలిపెట్టేది లేదని చెప్పారు.

Tags:    

Similar News