నేడు ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనుంది. దాదాపు 50వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ‘ప్రతి సంవత్సరం మార్చి 31లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇస్తాం. ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో డిసెంబర్ 9లోపు నియామక పత్రాలను పెట్టాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం’ అని సీఎం రేవంత్ గతంలో చెప్పారు. అయితే ఈ క్యాలెండర్ లో దాదాపు 50 వేల పోస్టులతో నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందిని ఖాళీ పోస్టుల్లో.. మోడల్ స్కూల్స్ లో 707 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 600 పోస్టులు, డైట్ కాలేజీలు, ఎస్సీఈఆర్టీ లో 110 పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.వీటితో పాటు.. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులు సంఖ్యపై త్వరలోనే స్పష్టత రానుంది. డీఎస్సీ ద్వారా మొత్తం 6 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.