తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. త్వరలోనే 6వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి DSC నోటిఫికేషన్ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ గురుకుల స్కూలులో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ‘గత పదేళ్లు DSC నోటిఫికేషన్ ఇవ్వకుండా బీఆర్ఎస్ విద్యావ్యవస్థను నాశనం చేసింది. మేం అధికారంలోకి రాగానే 11వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని ఆయన వెల్లడించారు. ఇటీవలే DSC పూర్తి అయ్యింది. మరో కొత్త DSC నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షలో విఫలం అయినా వారికి ఇదో లక్కీ చాన్స్ అనే చెప్పాలి. మరి ఇంకేందుకు ఆలస్యం. వెంటనే బుక్ తీసి చదవడం ప్రారంభించండి. పట్టుదలతో చదవండి.. ప్రభుత్వ కొలువు సంపాదించండి.