తెలంగాణలో కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు, 51 మరణాలు
తెలంగాణలో కరోనా ఉధృతి ఆగడం లేదు. కొత్తగా 6వేల 361 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 51 మంది మృతి చెందారు.;
తెలంగాణలో కరోనా ఉధృతి ఆగడం లేదు. కొత్తగా 6వేల 361 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 51 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4లక్షల 69వేల 722 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 77వేల 704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2వేల 527 మంది కరోనా బారిన పడి చనిపోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కరోజే 12వందల 25 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నల్గొండలో 453, మేడ్చల్‌లో 422, రంగారెడ్డిలో 423 కేసులు నమోదయ్యాయి.