తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు.. 51 మరణాలు
తెలంగాణలో కరోనా విరుచుకుపడుతూనే ఉంది. కొత్తగా 7వేల 754 పాజిటివ్ కేసులు రాగా.. 51 మంది చనిపోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 43వేల 360కి చేరింది.;
తెలంగాణలో కరోనా విరుచుకుపడుతూనే ఉంది. కొత్తగా 7వేల 754 పాజిటివ్ కేసులు రాగా.. 51 మంది చనిపోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 43వేల 360కి చేరింది. మరణాల సంఖ్య 2వేల 312కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15వందల 7 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 630, రంగారెడ్డిలో 544, సంగారెడ్డిలో 325, సిద్ధిపేటలో 279, మహబూబ్‌నగర్‌లో 279, నిజామాబాద్‌లో 267 కేసులు నమోదయ్యాయి.