హ్యాట్సాఫ్ బ్రదర్ : MBBS చదివి... కరోనా రోగులకు సహాయం.!
కరోనా... ఇప్పుడు దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇలాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.;
కరోనా... ఇప్పుడు దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇలాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగానే కరోనాతో బాధపడుతున్న వారికి పౌష్టికాహారం అందిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నాడు ఓ యువకుడు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన లోకేష్ .. ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉండేందుకు ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకున్న అతడు ... కరోనా బాధితులకు తన వంతు సాయంగా చికెన్, మాస్కలు, కూరగాయలు పండ్లు పంపిణీ చేస్తున్నాడు. ఇలా చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని లోకేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.