Telangana : గొర్రెల స్కాం కేసులో నిందితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు

Update: 2025-05-02 10:15 GMT

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కాంలో కీలక నిందితులు మొయినుద్దీన్, ఇక్రమ్ ల ఇళ్లలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ స్కాంలో కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్దిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెరలేపినట్లు గుర్తించిన ఏసీబీ ఈ కేసులో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీలలో కీలక ఫైళ్లు, బ్యాంక్ ఖాతాల వివరాలను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఈనేపథ్యంలో రూ. 2.10 కోట్ల మొత్తాలు గొర్రెల సరఫరా చేసిన రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేయడం వెనుక ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ స్కాంకు సంబంధించి కీలక ఫైల్స్, కంప్యూటర్స్ హార్డ్ డిస్క్లు మాయమైన ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు.

Tags:    

Similar News