TG : ఫైలేరియా, నులిపురుగుల నిర్మూల‌న‌కు చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

Update: 2024-08-10 10:30 GMT

రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నిర్మూల‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ తెలిపారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యమంత్రి ప్రతాప్ జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో 14 ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజనర్సింహ తెలిపారు. మెడిసిన్స్‌ పంపిణీకి 2,600 మంది సిబ్బందికి శిక్షణను ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామని తెలిపారు. అదేవిధంగా 2522 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు క్షేత్రస్థాయిలో సేవలందిస్తారని వెల్లడించారు.

Tags:    

Similar News