Mutyalamma Temple : ముత్యాలమ్మ ఆలయంలో అఘోరా పూజలు

Update: 2024-10-18 09:00 GMT

సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలో నాలుగు రోజుల క్రితం అమ్మవారి విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆలయాన్ని గురువారం మధ్యాహ్నం అఘోరా సందర్శించారు. ఒంటికాలుపై నిల్చుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఆలయంలో సంప్రోక్షణ కొనసాగుతోంది. ఈ సమయంలో అఘోరా ఆలయానికి రావడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడి వెనుకున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

Tags:    

Similar News