హిందూ సనాతన ధర్మం కోసం హైదరాబాద్ ముత్యాలమ్మ గుడిలో ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించిన అఘోరీమాతను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సిద్దిపేట నుంచి అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య వారి సొంత ఊరు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి తరలించారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్ఘలుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు అఘోరి మాత ఇంటికి భద్రతగా నిలిచారు. ఆ గ్రామానికి ఎవరినీ రానీయడం లేదు. చివరకు అఘోరి మాతను చూసేందుకు వస్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు.. హైదరాబాద్ వస్తూ కారులో పెట్రోల్ క్యాన్ తో తీసుకొచ్చారు అఘోరీ మాత. ధర్మాన్ని కాపాడేది ఎవరంటూ కారులోనే బోరున ఏడ్చిన అఘోరీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.