తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా క్లౌడ్ బరస్ట్ తరహాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో వీడే అవకాశం లేదని APSDMA తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.