CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై ఏలేటి సంచలన ఆరోపణలు

Update: 2024-07-11 08:25 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తుందని, కేంద్రం నుంచి వచ్చిన అమృత్ నిధుల్లో గోల్ మాల్ జరిగిందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మనుషులకే కాంట్రాక్టర్లు ఇచ్చారని మండిపడ్డారు. ఈ అవినీతి రేవంత్ రెడ్డి సోదరుడు కూడా భాగస్వామమేనని వ్యాఖ్యానించారు. మేఘా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారని చెప్పారు. ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బామ్మర్ది సృజన్ అనే వ్యక్తి కి చెందిన శోధ కంపెనీకి రూ. 400 వందల కోట్ల కాంట్రాక్టర్ ఇచ్చారని అన్నారు. రూ. 600 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ ను వెయ్యి కోట్లకు ఇచ్చినట్లు చెప్పారు. 30 నుంచి 35 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్ పొంచి కాంటాక్ట్స్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తం కలిపి రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల ఫండింగ్ కోసం..

అదే విధంగా సీఎం సొంత జిల్లాలోనే మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంటాక్ట్ పనులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ప్రాజెక్ట్ ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతుందని, ఆయన మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ నడుస్తుందని తెలిపారు. మేఘా కృష్ణారెడ్డితో తెలంగాణ సొమ్ము కక్కిస్తాను చెప్పి.. ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనకున్న మతలబు ఏమిటని నిలదీశారు. రాబోయే కొడంగల్ టెండర్లలో కూడా మేఘా కు పెద్ద పీట వెయ్యబోతున్నారన్నారు. ప్రతి టెండర్ లోనూ చీకటి కోణం ఉందని, త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలకు పార్టీ ఫండింగ్ కోసం రేవంత్ వసూళ్లు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వీటన్నింటికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News