సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్‌కు వెళ్లిన ఆయన వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న థియేటర్ బయట తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. కాగా శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చేతన్, విష్ణు తేజ్‌లు మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందటం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు.