AMARAVATHI: అమరావతి పనులు రయ్...రయ్
అమరావతిలో పనులు వేగవంతం.. రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన..త్వరలోనే మౌలిక వసతుల పనులు
అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ట్రంక్ రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. మంత్రి నారాయణ పర్యటనలో భాగంగా వడ్డమానులో ప్రధాన రహదారిని ప్రారంభించి, అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలిపారు మంత్రి నారాయణ.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో.....
అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రాజధానిలో ఎటు చూసినా వేల మంది కార్మికులు, వాహనాలు, యంత్రాలు, భారీ నిర్మాణ సామగ్రి దర్శనమిస్తున్నాయి. రాజధాని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, ట్రంక్ రోడ్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జిలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీసు అధికారుల భవన సముదాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికి శరవేగంగా ఎల్పీఎస్ లేఔట్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం లేఔట్లలో జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు రోడ్లు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే పనులు చేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీ నెస్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పైల్ ఫౌండేషన్ పనులు పూర్తి కావడంతో బేస్మెంట్ ఏర్పాటు చేయటం కోసం ప్రస్తుతం కార్మికులు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును 12 టవర్స్‌తో 2 బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్+ 18 ఫ్లోర్లుగా నిర్మిస్తున్నారు. ప్రతి ఫ్లోర్‌కు 4 లేదా 6 ప్లాట్లను నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 1200 ప్లాట్లు నిర్మించనున్నారు. 29.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికి ఎల్పీఎస్ లేఅవుట్ నిర్మాణ పనులు కూడా వేగవంతం అయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు రోడ్లు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. ఏపీ ఎన్ఆర్టీ, హ్యాపీనెస్ట్ పనులు ఊపందుకున్నాయి. హ్యపీనెస్ట్కు పైల్ ఫౌండేషన్ పనుల్ని పూర్తిచేసి బేస్మెంట్ కోసం ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టారు.
మంత్రి నారాయణ పర్యటన
రాజధాని పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని.. వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తిచేస్తామని వివరించారు. సోమవారం వడ్డమానులో రహదారిని ప్రారంభించిన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. రాజధానిని గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వెస్ట్ బైపాస్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కరకట్టకు సమాంతరంగా సీఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామన్నారు. దేశానికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఈనెల 25న ఆవిష్కరిస్తామని చెప్పారు.
మరోవైపు మంత్రి నారాయణ రాజధానిలో పర్యటించారు. వడ్డమానులో మంత్రికి, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి ప్రధాన రహదారిని ప్రారంభించారు. రైతుల రిక్వెస్ట్‌తో కేవలం వారం రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అమరావతి ప్రపంచంలో టాప్5 లో ఉండేలా నిర్మిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించామన్నారు. 98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మించామని తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌలిక వసతుల పనులు చేపడతామన్నారు మంత్రి నారాయణ. ఈ అభివృద్ధి పనులు రూ.900 కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధమైందన్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి.. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. అమరావతిలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఇన్నర్ రింగ్ రోడ్,స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటామన్నారు. అమరావతిలో వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపడతామన్నారు.