దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిపై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ MOU చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. అటు నిన్న ఒక్కరోజే రూ.56వేల కోట్లకుపైగా పెట్టుబడులపై పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టనుండగా, దీని ద్వారా 17వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీలో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్ ఈ మేరకు వెల్లడించారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ.71,800 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇది గతేడాదితో పోలిస్తే ఎక్కువ.
* సన్ పెట్రో కెమికల్స్(రూ.45,500కోట్లు, 7000 జాబ్స్)
* మేఘా ఇంజినీరింగ్(రూ.15000కోట్లు, 4250 జాబ్స్)
* కంట్రోల్ S(రూ.10,000కోట్లు, 3600 జాబ్స్)
* JSW(రూ.800కోట్లు, 200 జాబ్స్)
* స్కైరూట్(రూ.500కోట్లు)
* HCL, విప్రో కొత్త సెంటర్ల ఏర్పాటు ద్వారా 10వేల ఉద్యోగాలు
* యూనీలివర్ 2 మ్యానుఫాక్చర్ యూనిట్లు నెలకొల్పనుంది.