Amit shah : బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్..!
Amit shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది.;
Amit shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. ఈ క్రమంలో బండి సంజయ్ కి అమిత్ షా అభినందలు తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే బీజేపీ గెలుస్తోందని అన్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని సూచించారు. అటు హుజురాబాద్ ఎన్నికల ఫలితాల పైన అమిత్ షా టీం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. అటు హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. పదహారో రౌండ్‌లో టీఆర్ఎస్‌పై బీజేపీ 1712 ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల 13,195 మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు బీజేపీ 74.175 ఓట్లు సాధించగా.. టీఆర్ఎస్ 60,980 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడింది.