Amit Shah : హైదరాబాద్‌కు రానున్న అమిత్‌షా.. అక్కడ భారీబహిరంగ సభ ఏర్పాటు..
Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెలాఖరుకి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు.;
Amith Shah : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెలాఖరుకి తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు రావాల్సిందిగా ఆహ్వానించబోతున్నారు. అమిత్‌షా పర్యటన ఖాయంగా ఉంటుందని బీజేపీ వర్గాలు సైతం చెబుతుండడంతో మునుగోడులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. చండూరులో బహిరంగ సభ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభ నుంచే ఉప ఎన్నికకు శంఖారావం పూరించాలని కమలదళం భావిస్తోంది.
కేంద్రమంత్రి అమిత్‌షా సూచన మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు కోమటిరెడ్డి. రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగితే.. తిరిగి గెలిపించుకునే బాధ్యత తాము చూసుకుంటామని స్వయంగా అమిత్‌షా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మునుగోడు బహిరంగ సభకు అమిత్‌షా వచ్చేందుకు రెడీగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చే నవంబర్ లేదా డిసెంబర్‌లో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది.