పుట్టినరోజు వివాహ శుభకార్యాల్లో బహుమతులు అందివ్వడం సాధారణమే. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన చిలక బత్తిని రామారావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తన వీరాభిమానం చాటుకున్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పుట్టినరోజు వేడుకలను గ్రామంలో వేడుకగా నిర్వహించారు. ప్రస్తుతం అది టాక్ ఆప్‌ది టౌన్‌గా మారింది. మంత్రి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజున గ్రామంలో కేక్ కోసి స్వీట్లు పంచారు. గ్రామానికి ఓ ఆంబోతును కానుకగా ఇచ్చారు. ఆంబోతుకు పూజలు నిర్వహించి అందజేశారు. గతంలో గ్రామంలో ఒక ఆంబోతు ఉండేది, అది ఈ మధ్యనే అనారోగ్యంతో చనిపోయింది. ఈ ఆంబోతు దాని స్థానాన్ని భర్తీ చేస్తుందన్నారు. గ్రామానికి ఆంబోతునిచ్చిన రామారావును పలువురు అభినందించారు.