కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మోటర్లు పనికిరాకుండా అయితే మళ్లీ ఆ బదనాం బీఆర్ఎస్ పార్టీపై వేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ, ప్రతీకా రం తీర్చుకుంటోందన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ కు నీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో హరీశ్ రావు మా ట్లాడుతూ ' కావాలనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదు. సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు వృథాగా ఉంచుతున్నరు. అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ తదితర రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపాలని మంత్రి ఉత్తమ్ కు లేఖ రాసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లెత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్. రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు. మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రైతాం గానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నది. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి? బీఆ ర్ఎస్ నేతల మీద కోపం ఉంటే.. రైతులకు శిక్ష వేస్తారా? వరద నీటిని ఒడిసి పట్టండి. బురద రాజకీయాలు మానండి. బీహెచ్ఎల్ ఇంజి నీర్లను అడగండి. ఆన్ ఆఫ్ పద్ధతిలో నడిపితే మోటర్లు కాలిపోతాయి అని హెచ్చరిస్తున్నం' అని అన్నారు.