TG: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్... అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ;
తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాకు రెడ్‌అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. గత 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో అత్యధికంగా 5.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు మహారాష్ట్రలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. ఇక మధ్యప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పొంగిపొర్లుతున్న వంతెనను దాటుతూ సియోనిలో ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. బైక్‌పై వంతెన దాటుతుండగా.. ఈఘటన జరిగింది. కొట్టుకుపోయిన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీలోను జోరు వర్షం కురుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపధ్యంలో తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.