తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది. ఇకపై రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా మీసేవ కేంద్రాల్లో ఆన్ లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్థిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.