హైదరాబాద్ పాతబస్తీలోని అరేబియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్రిజ్‌లో కుళ్లిన మాంసం గుర్తించారు. ఫ్రిజ్‌లో పాడైపోయిన వండిన వంటకాలు గుర్తించారు. పాతబస్తీలోని షాదాబ్ హోటల్‌లో అధికారుల తనిఖీలు చేసి షాకిచ్చారు.
పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ గుర్తించారు అధికారులు. కాటేదాన్‌లోని మూడు ఆయిల్ కంపెనీల్లోనూ సోదాలు చేశారు. భాగ్యనగర్ ఆయిల్, కేడియా ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీల్లో సోదాలు చేశారు.
వంట నూనె తయారీలో నిబంధనలను కంపెనీలు పాటించడం లేదని.. నిల్వ ఉంచిన రా మెటీరియల్‌లో పురుగులు ఉన్నా అలాగే వాడుతున్నారని గుర్తించిన అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.