AZHAR: అజారుద్దీన్‌కు మైనార్టీ శాఖేనా..?
మైనార్టీ లేదా హోంశాఖ ఇస్తారంటూ విస్తృత ప్రచారం
అజారుద్దీన్ రాకతో తెలంగాణ కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి చాలా శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. మైనార్టీ సంక్షేమం, విద్యా, హోంశాఖ అన్నీ కూడా రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. ఇందులో ఏ శాఖను ఆయనకు ఇస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే మైనార్టీ సంక్షేమ శాఖ లేదా క్రీడా శాఖ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞత తెలియజేశారు. సహచర మంత్రులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఇదీ ప్రస్థానం..
1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో అజారుద్దీన్ జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. నిజాం కాలేజీలో బీకాం చదివారు. మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ వైపు అడుగులు వేశారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశం చేశారు. అజారుద్దీన్ క్రికెటర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌పార్టీలో చేరారు. అదే సంవత్సరం యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌ను నియమించారు. తొలిసారి 1984లో అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే మొదటి 3 టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు.