అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ రసూల్‌పురలో అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ.;
స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా... ఆయన తనయుడు.. నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్ రసూల్‌పురలో అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు. రసూల్‌పుర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌తోపాటు.. పెద్ద సంఖ్యలో అన్నగారి అభిమానులు పలువురు టీడీపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.