Balka Suman : తుపాకీ బులెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుడి హల్‌చల్..

Balka Suman : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు;

Update: 2022-09-29 16:00 GMT

Balka Suman : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. తుపాకీ బుల్లెట్స్ తో జై బాల్క సుమన్ అంటూ మొబైల్ స్టేటస్ పెట్టుకున్నాడు. వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి దాదాపు 60 తుపాకీ బుల్లెట్స్ ను ఉపయోగించినట్లు సమాచారం. సింగరేణి లాభాల వాటా ప్రకటనతో ఆనంద పడిన కొప్పుల రవి.. తుపాకీ బుల్లెట్స్ తో స్టేటస్ పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీరాంపూర్ డివిజన్ లో సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్న రవి.. ప్రస్తుతం మొబైల్ స్విచ్ఛాప్ చేసుకుని పరారీలో ఉన్నట్లు సమాచారం. బాల్కసుమన్ అనుచరుడు రవికి ఎక్కడి నుంచి బుల్టెట్స్ వచ్చాయని అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News