Balka Suman : తమిళిసై గవర్నరా లేక బీజేపీ నాయకురాలా : బాల్క సుమన్
Balka Suman : తెలంగాణ గవర్నర్ తమిళిసై పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.;
Balka Suman : తెలంగాణ గవర్నర్ తమిళిసై పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ బీజేపీ కండువా కప్పుకొని తిరిగితే బాగుంటుందని ఆరోపించారు. తమిళిసై పొలిటికల్ లీడర్‌లాగ స్టేట్‌మెంట్ ఇస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు.
తమిళిసై.. గవర్నరా? లేక బీజేపీ నాయకురాలో చెప్పాలని బాల్క సుమన్ నిలదీశారు. ఇక టీఆర్ఎస్‌లో కూడా ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. తెలంగాణ.. యూపీ, మహారాష్ట్ర కాదని.. ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్నారు. త్వరలో తెలంగాణలో బీజేపీ ఖాళీ కాబోతోందని బాల్క సుమన్ స్పష్టంచేశారు.