BANDH: నేడు తెలంగాణ బంద్

బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త బంద్.. బీసీ బంద్‌కు మద్దతు తెలిపిన అన్ని పార్టీలు.. తమ మద్దతు ఉంటుందన్న తెలంగాణ సర్కార్

Update: 2025-10-18 02:30 GMT

బీ­సీ­ల­కు 42% రి­జ­ర్వే­ష­న్ల అమలు కోసం బం­ద్‌ ఫర్‌ జస్టి­స్‌ పే­రు­తో తె­లం­గాణ వ్యా­ప్తం­గా నేడు బంద్ జర­గ­నుం­ది. వై­ద్య సే­వ­లు మి­న­హా మి­గి­లిన అన్ని సే­వ­ల­ను బంద్ చే­య­ను­న్నా­రు. బీ­సీల గళా­న్ని దే­శా­ని­కి వి­ని­పిం­చే వి­ధం­గా తమ పో­రా­టం ఉం­టుం­ద­ని బీసీ జే­ఏ­సీ ఛై­ర్మ­న్ ఆర్.కృ­ష్ణ­య్య ప్ర­క­టిం­చా­రు. ‘హై­కో­ర్టు స్టే ఇచ్చిం­ది.. సు­ప్రీం­కో­ర్టు­లో కేసు తే­లి­పో­యిం­ది.. ఇక ఉద్య­మ­మే మి­గి­లిం­ది. రా­ష్ట్రం­లో­ని రెం­డు­న్నర కో­ట్ల మంది బీ­సీ­లు ఒక్క­ట­వ్వా­లి. పో­రు­బాట పట్టా­లి’ అని రా­జ్య­సభ సభ్యు­డు, బీసీ నేత ఆర్‌ కృ­ష్ణ­య్య, బీసీ నేత జా­జుల శ్రీ­ని­వా­స్‌­గౌ­డ్‌ పి­లు­పు­ని­చ్చా­రు. నేడు జరి­గే బీసీ రా­ష్ట్ర బం­ద్‌ దే­శం­లో­నే కొ­త్త అధ్య­య­నా­ని­కి నాం­ది పల­కా­ల­ని, దే­శా­ని­కే ఒక సం­దే­శం ఇవ్వా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. తె­లం­గాణ రా­ష్ట్ర వ్యా­ప్తం­గా పా­ఠ­శా­ల­లు, కళా­శా­ల­లు బం­ద్‌ ఉం­డ­ను­న్నా­యి. బీసీ సం­ఘాల ఆధ్వ­ర్యం­లో రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా బంద్ ని­ర్వ­హ­ణ­కు మద్ద­తు­గా పా­ఠ­శా­ల­లు, కా­లే­జీ­ల­కు సె­ల­వు ప్ర­క­టిం­చా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్‌­ల­లో భా­గం­గా ఈ బం­ద్‌­కు పి­లు­పు­ని­చ్చా­యి. బం­ద్‌ ఫర్‌ జస్టి­స్‌ పే­రు­తో ని­ర్వ­హిం­చే ఈ కా­ర్య­క్ర­మం­లో బీ­సీ­లు అధి­క­సం­ఖ్య­లో పా­ల్గొ­నా­ల­ని, వి­ద్య, వ్యా­పార వా­ణి­జ్య రం­గా­లు స్వ­చ్ఛం­దం­గా బం­ద్‌ పా­టిం­చా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. రా­ష్ట్ర బం­ద్‌ ప్ర­భు­త్వా­ని­కి మొ­ద­టి హె­చ్చ­రిక మా­త్ర­మే­న­ని, బీ­సీల డి­మాం­డ్లు పరి­ష్క­రిం­చ­క­పో­తే.. తర్వాత అగ్ర­వ­ర్ణా­ల­కు ఓట్ల బం­ద్‌ కా­ర్య­క్ర­మా­న్ని కూడా ని­ర్వ­హి­స్తా­మ­ని హె­చ్చ­రిం­చా­రు.

76 ఏళ్లుగా బీసీలకు అన్యాయం..

దే­శా­ని­కి స్వా­తం­త్ర్యం వచ్చి 76 ఏళ్లు అయి­న­ప్ప­టి­కీ.. బీ­సీ­లు ఇంకా తమకు దక్కా­ల్సిన న్యా­యం కోసం పో­రా­డా­ల్సిన పరి­స్థి­తి ఉంది. రా­జ్యాం­గం కల్పిం­చిన హక్కు­లు వా­రి­కి పూ­ర్తి­గా దక్క­డం లే­ద­నే ఆవే­దన బీసీ నా­య­కు­ల్లో బలం­గా ఉంది. బీ­సీల జనా­భా­కు అను­గు­ణం­గా వా­రి­కి రి­జ­ర్వే­ష­న్లు లే­క­పో­వ­డం ప్ర­ధాన సమ­స్య. వి­ద్య, ఉద్యో­గా­లు, రా­జ­కీయ పద­వు­ల­లో బీ­సీల వాటా తక్కు­వ­గా ఉంది. ము­ఖ్యం­గా స్థా­నిక సం­స్థ­లు, చట్ట సభ­ల్లో తగిన ప్రా­తి­ని­ధ్యం లే­క­పో­వ­డం వల్ల వారి గళం బలం­గా వి­ని­పిం­చ­డం లేదు. 42 శాతం రి­జ­ర్వే­ష­న్ అమ­లు­కు సం­బం­ధిం­చి హై­కో­ర్టు స్టే ఇవ్వ­డం వల్ల బీ­సీ­లు మరింత అవ­మా­నం­గా భా­వి­స్తు­న్నా­రు. ఎన్ని­కల నో­టి­ఫి­కే­ష­న్ వె­లు­వ­డిన తర్వాత రి­జ­ర్వే­ష­న్ల అం­శం­పై స్టే ఇవ్వ­డం న్యా­యం కా­ద­నే వా­ద­న­ను ఆర్. కృ­ష్ణ­య్య బలం­గా వి­ని­పిం­చా­రు. ఈ అవ­మా­నా­న్ని భరిం­చ­లే­క­నే.. చట్ట సభ­ల్లో బి­ల్లు పె­ట్టేం­త­వ­ర­కు ఈ పో­రా­టా­న్ని ముం­దు­కు తీ­సు­కు­వె­ళ్తా­మ­ని తెలిపారు.

‘బీసీల న్యాయమైన ఆకాంక్షలకు ఏర్పడ్డ అడ్డంకులను నిరసిస్తూ శనివారం రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్నాం. ఇది ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంద్‌ ప్రశాంత వాతావరణంలో విజయవంతమయ్యేందుకు విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు సహకరించాలి. ఒక్క మెడికల్‌ షాపులు మినహా మరేవీ తెరవొద్దు’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. పోలీసు అధికారులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం బీసీ ఐకాస వైస్‌ ఛైర్మన్‌ వీజీఆర్‌ నారగోని, సమన్వయకర్త గుజ్జ కృష్ణల అధ్యక్షతన బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్‌ చేపడుతున్నామని తెలిపారు.

Tags:    

Similar News