హైదరాబాద్ జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ పొలిటికల్ వార్ కు తెర లేపింది. తాజాగా రేవ్ పార్టీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విషయంలో సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలు మీడియాలో వార్తలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని అన్నారు.