మంత్రి అజయ్‌పైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డ బండి సంజయ్
తాము అధికారంలోకి రాగానే అజయ్‌కు చెందిన 93, 94 సర్వే నంబర్లలో కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు.;
తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన మేధావి వర్గం.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించకపోవడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఇంటలెక్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో అవినీతి కుటుంబ మూర్ఖత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు.
కేంద్రం నిధుల వల్లనే గ్రామాల్లో అభివృద్ధి సాగుతోందని.. కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తున్నా ఎక్కడా మోదీ పేరు చెప్పడం లేదని విమర్శించారు.
మంత్రి అజయ్‌పైనా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్ధాంతాల గురించి మాట్లాడే అర్హత అజయ్‌కు లేదన్నారు. జిల్లాలో అన్ని కాంట్రాక్టులు ఆయనే చేపట్టారని.. కోట్లు ఇచ్చి మంత్రి పదవి సంపాదించారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే అజయ్‌కు చెందిన 93, 94 సర్వే నంబర్లలో కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు.