మేము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను దున్నేస్తాం : బండి సంజయ్
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌజ్‌ను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.;
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌజ్‌ను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రెండుసార్లు అసెంబ్లీని ముట్టడించామని... మమ్మల్ని ఆపగలరా అంటూ నిలదీశారు. వారం రోజుల్లో పోడుభూముల సమస్యను పరిష్కరించాలని సంజయ్ డిమాండ్ చేశారు. బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో పాల్గొన్న ఆయన.. ఎస్టీల రిజర్వేషన్‌పై కేసీఆర్‌కు చిత్తశుద్దిలేదని ఆరోపించారు. ఇంతమంది దళితుల్లో ఒక్కరికి సీఎం అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు.