Union Minister Bandi Sanjay : శ్రీతేజ్‍‌కు బండి సంజయ్ పరామర్శ

Update: 2024-12-23 12:00 GMT

సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలైన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్రమంత్రి బండి సంజయ్. కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని కోరారు బండి సంజయ్. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, స్థానిక బీజేపీ నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు. శ్రీతేజ్ త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News