రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు క్లియరెన్స్ సర్టిఫిటికెట్ ఇవ్వాలని చెప్పారు. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందన్నారు. సోనియాగాంధీ బర్త్ డే రోజున రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని బండి అన్నారు. కాంగ్రెస్‌కే ఆ అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ను కలుపుకుంటే బీజేపీ ఏమైన అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవడం గ్యారెంటీ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు వేయలేదని నిలదీశారు. ఢిల్లీలో లాబీయింగ్ జరిగిందని.. అందుకే ఫోన్ ట్యాపింగ్, భూస్కాం వంటివి అటకెక్కాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేరికలను పక్కనబెట్టి ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టాలని చెప్పారు.