Bandi Sanjay: డ్రగ్స్, ఇసుక మాఫియాలు అన్నిటికీ కేరాఫ్ టీఆర్‌ఎస్ పార్టీనే- బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.;
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనతో టచ్‌లో ఉన్నారని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆయన చాలా మంచి పొలిటికల్ లీడర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నుండి కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎప్పుడో పారిపోయాయని ఎద్దేవా చేశారు.
కమ్యూనిస్టులు ఎప్పుడు పోతారో చూడాలని.. వాళ్లు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదని విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ కేడర్ బీజేపీకి సపోర్ట్ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లైసెన్డ్స్ గూండాలు అయిపోయారని విమర్శించారు. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తోందన్నారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు భయపడే పెన్షన్‌లు, చేనేత బీమా లాంటి పథకాలు ఇస్తున్నారన్నారు.
హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా అన్నిటికీ కేరాఫ్ టీఆర్‌ఎస్ పార్టీయేనని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్ రెడీ చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చెప్తామని హెచ్చరించారు. ఉద్యోగుల మీద సీఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో ఒక్కో ఓటుకు 20వేలు టీఆర్‌ఎస్ పంచిందని ఆరోపించారు.