టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలి : బండి సంజయ్
టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్. బండి సంజయ్ సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీలో చేరారు.;
టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్. బండి సంజయ్ సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీలో చేరారు. రాజకీయ స్వార్థ కోసం పీవీని కేసీఆర్ వాడుకుంటున్నారన్న బండి సంజయ్.. పీవీ కూతురును రాజ్యసభకు ఎందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం పీవీ కవచాన్ని కప్పుకుని డ్రామాలాడుతోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసి పొరపాటు చేయొద్దని... ప్రజాసమస్యలపై పోరాడుతున్న బీజేపీ అభ్యర్థును గెలిపించాలని కోరారు.