గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా అశోక్ నగర్ వెళ్లారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. బండి సంజయ్ రాగానే నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. విద్యార్థులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రేవంత్ సర్కార్ జీవో ఇచ్చిందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రాకతో అశోక్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.