BANDI SANJAY: “46 దారి మైసమ్మ ఆలయాలను కూల్తేస్తారా..?"
అధికారులకు బండి సంజయ్ వార్నింగ్
రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేతపై వివాదం నెలకొంది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు తొలగించారు. దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు ఎలా కూల్చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. అయితే, రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు వదిలేశారని ధ్వజమెత్తారు. హిందూ ఆలయాలంటే అంత చులకనా.. ఎంత ధైర్యమని నిలదీశారు. అధికారులకు 48 గంటల టైమ్ ఇస్తున్నానని కూల్చిన అన్ని దారి మైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించాలని హెచ్చించారు. లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అవ్వగానే వచ్చేది గోదావరిఖనికేనని.. అధికారుల సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. దారి మైసమ్మ ఆలయాలను కట్టించకపోతే.. తానే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానని అన్నారు. జరిగిన ఘటనపై ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి అధికారుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అంతరించిపోయే పార్టీ: బీజేపీ
అభివృద్ధిని ఓర్చుకోలేకనే మాజీ సీఎం జగన్ కూటమి పాలనపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అంతరించిపోయే పార్టీ.. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తోందని చెప్పారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ధైర్యం ఉంటే చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు. వివేకా హత్య కేసులో దోషులను వెనకేసుకొస్తున్న జగన్ క్యారెక్టర్ ఏమిటో అందరికీ తెలుసన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతోనే వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని జేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు.