Bandi Sanjay : ఇవాళ్టి నుంచి బండి సంజయ్‌ రెండోవ విడత ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇవాళ్టి నుంచి 2వ విడత పాదయాత్ర చేపట్టబోతున్నారు.

Update: 2022-04-14 03:30 GMT

Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇవాళ్టి నుంచి 2వ విడత పాదయాత్ర చేపట్టబోతున్నారు. సాయంత్రం అలంపూర్‌ నుంచి నడక మొదలవుతుంది. జోగులాంబ అమ్మవారి దర్శనం తర్వాత బహిరంగ సభ నిర్వహించి.. తర్వాత యాత్ర ప్రారంభిస్తారు. తెలంగాణ BJP ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి 10 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుంది.

మొత్తం 105 గ్రామాల్ని కవర్‌ చేస్తూ.. ఆయా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ సంజయ్‌ ముందుకు సాగుతారు. మొత్తం 31 రోజులపాటు సాగనున్న యాత్ర.. మే 14న మహేశ్వరంలో ముగుస్తుంది. ఆ సభలో బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొంటారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగాగనే యాత్ర చేపట్టానంటున్న సంజయ్‌.. యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తానంటున్నారు.

ఇవాళ ఉదయం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి తర్వాత అక్కడి నుంచి అలంపూర్‌ బయలుదేరతారు సంజయ్‌. మొదటిరోజు సభ తర్వాత 4 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది. రాత్రికి ఇమామ్‌పూర్‌లో బస చేస్తారు. రేపట్నుంచి ప్రతిరోజు 13 కిలోమీటర్లు చొప్పున మొత్తం 387 కిలోమీటర్లు సాగేలా పాదయాత్ర రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు.

అలంపూర్‌ నుంచి గద్వాల, మక్తల్‌, నాగర్‌ కర్నూలు, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి మీదుగా మహేశ్వరం వరకూ రెండో విడతలో కవర్ చేస్తారు. పాయ్తర సందర్భంగా ఊరూరా రచ్చబండలు నిర్వహిస్తారు. అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు, సభలు పెడతారు. మొత్తంగా క్యాడర్‌లో జోష్‌ తెస్తూ, ప్రజల్లో భరోసా నింపేలా ఈ సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు BJP నేతలు చెప్తున్నారు.

Tags:    

Similar News