తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి హామీలకు విలువలేకుండా పోయిందన్నారు కేంద్ర హోం సహాయ మంత్రి బండిసంజయ్. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పోయ్యిలో పడినట్లు అయ్యిందన్నారు. కాంగ్రెస్ పానలలో హిందూ దేవాలయాలపై దాడులతో పాటు...లవ్ జిహాదీలు పెరిగిపోయాయని సీరియస్ అయ్యారు. యూఎస్ లోని ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఎన్నారైలతో మాట్లాడారు సంజయ్. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న ఆయన... ఆ పార్టీలో క్యాడర్ లేదన్నారు. నేతలు గోపిలయ్యారని సీరియస్ అయ్యారు.