పాము కాటుకు గురైన బాసర ఆలయ పూజారి

బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకత్వం నిర్వర్తిస్తున్న ఆలయ పూజారిని నీటి పాము కాటు వేసింది.;

Update: 2023-10-31 06:36 GMT

బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకత్వం నిర్వర్తిస్తున్న ఆలయ పూజారిని నీటి పాము కాటు వేసింది. తక్షణం స్పందించిన సిబ్బంది అతడిని హుటాహుటిన సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

పురాతన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకుడు సోమవారం బాసరలోని పుణ్యక్షేత్రం ఆవరణలోని ఉప దేవాలయంలో పూజలు చేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. అయితే, పాము విషం లేనిది కావడంతో అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

శ్రీ దత్తాత్రేయ దేవాలయంలో పూజలు చేస్తుండగా పూజారి ప్రసాద్‌ను పాము కాటు వేసినట్లు సిబ్బంది తెలిపారు.పూజారి చెకర్డ్ కీల్‌బ్యాక్ అనే నీటి పాము కాటుకు గురైనట్లు పుణ్యక్షేత్రం అధికారులు తెలిపారు. అయితే, ఈ సంఘటన అర్చకులలో భయాందోళనలను సృష్టించింది. తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను పూజారులు అభ్యర్థించారు.

ఆలయం చుట్టూ పెద్ద బండరాళ్లు, కొండలు ఉంటాయి. చుట్టూ చెట్లు ఉండడంతో వివిధ జాతుల పాములు నివసించేందుకు అనుకూలంగా మారిపోయింది. సమీపంలోని చెరువు లేదా ట్యాంక్‌లో నివసించే పాము ఆలయంలోకి ప్రవేశించి పూజారిని కాటు వేసి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

Tags:    

Similar News