TG: మహిళల పేరుపైనే ఇందిరమ్మ ఇళ్లు

శాసనసభలో ఆర్థికమంత్రి భట్టి ప్రకటన... ఆరు గ్యారంటీలకు భారీగా నిధులు;

Update: 2025-03-19 07:00 GMT

తెలంగాణలో మహిళలకే పెద్ద పీట వేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి భట్టి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణానికి రూ.5,005 కోట్లు ఆదా అయినట్లు వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.433 కోట్లు ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా మహిళల పేరు మీదే ఇవ్వాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.

ఆరు గ్యారంటీలకు భారీగా నిధులు

తెలంగాణ బడ్జెట్ లో ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. మొత్తం 6 గ్యారంటీల కోసం రూ. 56,804 కోట్లు కేటాయించారు. మహా లక్ష్మి పథకానికి రూ. 1,305 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.2080 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ. 1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ. 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ. 600 కోట్లు కేటాయించారు. సన్న బియ్యం బోనస్ కు రూ. 1800 కోట్ల కేటాయించారు.

విద్యార్థులకు భారీ శుభవార్త

2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ పద్దులో విద్యార్థులకు భట్టి భారీ శుభవార్త వినిపించారు. విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో IIT-JEE, NEET కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు కల్పించబోతున్నామని ప్రకటించారు. గురుకులాల్లో డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచుతామన్నారు. పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కడుపు మార్చుకుండా ఉచితంగా సాయంత్రం వేళ స్నాక్స్ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక సంక్షేమ వసతి గృహాల్లో ‘కామన్ డైట్’ స్కీం అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.

Tags:    

Similar News