Bhoodan Land Issue : భూదాన్ భూముల వ్యవహారం.. ఐపీఎస్లకు చుక్కెదురు!

Update: 2025-04-30 11:30 GMT

నాగారంలోని భూదాన్ భూముల వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ ఐపీఎస్ లకు స్పష్టం చేస్తూ విచారణ ముగించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం లోని సర్వే నంబర్ 181,182 లో 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఈ భూమిపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది.. ఇందులో అక్రమాలు జరిగాయని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధి కారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ప్రభుత్వంతోపాటు పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్లు, వారి భార్యలు, పిల్లలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ప్రభుత్వం, సీబీఐ, ఈడీతోపా టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అప్పటివరకు ఈ భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. దీనిపై ఐపీఎస్ అధికారులు రవి గుప్తా, మహేశ్ భగవత్, శిఖా గోయల్, సౌమ్యా మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగె పిటిషన్లు దాఖలు చేశారు. ఇవాళ విచారణకు స్వీకరించిన ధర్మాసనం సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు విచారణ ను ముగించింది.

Tags:    

Similar News