BIG BREAKING: కేసీఆర్‌కు బిగ్ షాక్..

రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్

Update: 2025-12-23 06:15 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ హయాంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారణకు పిలిచింది. కాగా.. రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్.. హరీష్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. . మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.అప్పటి ప్రభుత్వ పెద్దలైన కెసీఆర్, హరీష్, కేటీఆర్ ల కోసం టాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు విచారణలో చెప్పారు. ఓ ఛానల్ ఎండితో కలిసి హరీష్ రావు టాపింగ్ చేయించినట్లు గుర్తించారు . కొంతమంది కోసం కేటీఆర్ టాపింగ్ చేయించినట్లు సమాచారం.

కేసీఆర్ కు నోటీసులు జారీ అంశం ఈ కేసులో కీలక మలుపుగా మారనుంది. ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో.. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిట్ ఈ కేసులో ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతోపాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది. మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను కూడా విచారించింది. ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్‌లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది.

Tags:    

Similar News