నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన కుటుంబానికి రూ.1.41 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన మీద 3 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నట్లు తెలిపారు. రూ.16500 నగదు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. తనతోపాటు తన కుటుంబంలో ఎవరికీ సొంత వాహనాలు లేవని పేర్కొన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన గడ్డం వంశీకృష్ణ కోటీశ్వరుడే కానీ ఆయనకు సొంత కారు లేదు. వంశీకృష్ణ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.21,59.73,094 స్థిర, చరాస్తులు ఉన్నాయి. స్థిర ఆస్తుల విలువ రూ.4,17,05,497 కాగా, ఆయన భార్య పేరిట రూ.52,03,178 విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే రూ.6.83 కోట్ల విలువైన రుణాలు ఉన్నాయి. వంశీకృష్ణ పేరిట రూ.17,42,67,687 విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు.
నిజామాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రూ.3,85,90,017 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. చీమన్‌పల్లిలో 25 ఎకరాల భూమి, భార్య పేరు మీద 6 ఎకరాల 21 గుంట భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఒక ఇల్లు, రాజేంద్రనగర్‌లో 500 గజాలు, కొండాపూర్‌లో 100 గజాలు, జక్రాన్‌పల్లిలో 6 ఎకరాల 20 గుంటల భూమి, బీబీపూర్‌లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు.