Dil Raju : బర్త్ డే స్పెషల్.. సీఎం రేవంత్ ఇచ్చిన పదవి స్వీకరించిన దిల్ రాజ్
తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి వి. వెంకట రమణా రెడ్డి (దిల్ రాజు) అధ్యక్షులుగా పదవి భాద్యతలు స్వీకరించారు. గత వారం, పది రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజు టీమ్ తో సెక్రటేరియట్ లో భేటీ అయ్యారు. తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గురించి చర్చించారు. ఇప్పుడు విధానం.. మార్పులపై సమగ్రంగా చర్చించారు. బెటర్ మెంట్ కోసం ఏం చేయాలో డిస్కస్ చేశారు. కార్పొరేషన్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకునేందుకు దిల్ రాజు అంగీకరించారు. దిల్ రాజు బర్త్ డే సందర్భంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇండస్ట్రీ తరఫున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి దిల్ రాజుకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. దిల్ రాజు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తంచేసింది.