TG : బీజేపీ బీ టీం బీఆర్ఎస్.. సీతక్క ఎదురుదాడి

Update: 2024-11-12 09:45 GMT

బీఆర్ఎస్ త‌ప్పుడు ప్రచారంపై మంత్రి సీత‌క్క ఫైర్ అయ్యారు. బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ ప‌నిచేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవ‌హ‌రిస్తోందన్నారు. పదే ప‌దే త‌ప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని ఫైర్ అయ్యారు. కేసుల నుంచి తప్పించుకోడానికే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కేటీఆర్ ఢిల్లీ టూర్ లోనూ ఏదో మతలబు ఉందన్నారు సీతక్క.

Tags:    

Similar News