BJP: ఉద్యమకారులే బీజేేపీ టార్గెట్.. వారికోసమే ప్రత్యేకంగా సభ..
BJP: ఎన్నికలకు ఇంకా గడువు ఉండగానే.. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది.
BJP: ఎన్నికలకు ఇంకా గడువు ఉండగానే.. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్దం చేసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కూడా రాష్ట్రంలో పాగా వేసేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీ , కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రంలో భలం పెంచుకునేందుకు ప్రజలకు చేరువయ్యేందుకు అనేక అంశాలపై పోరుబాట పడుతోంది బీజేపీ నాయకత్వం. ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యామన్న అభిప్రాయంతో ఉన్న రాష్ట్ర నాయకత్వం మరింత దూకుడును పెంచేందుకు సిద్దమవుతోంది. టీఆర్ఎస్ విమర్శలకు ఘాటుగా సమాధానం చెబుతూ దూసుకుపోతోంది.
ఇక పార్టీని భలోపేతం చేయడంలో భాగంగా జాతీయ నాయకులు సైతం రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఒకే నెలలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించి బీజేపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ తరువాత పార్టీ కేడర్ మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు సిద్దమవుతోంది.
ఇక అన్ని వర్గాల వారిని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు వినూత్న రీతిలో కార్యాచరణ అమలు చేస్తున్నారట బీజేపీ నేతలు. గత కొద్ది రోజుల క్రితం వరకు ఉధ్యమకారులకు దూరంగా ఉన్న పార్టీని వారికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఇందులో కొంత మేర సక్సెస్ అయ్యామని కూడా చెబుతున్నారు నేతలు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉధ్యమ ఆకాంక్షల నెరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది అంటూ విమర్శలు చేస్తూ వచ్చిన బీజేపీ నేతలు..
ఆకాంక్షలు నెరవేర్చడం తమ తోనే సాధ్యం అంటూ ప్రచారం మొదలు పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇదే అంశాన్ని బహిరంగ సభ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణలో అమరులు , ఉధ్యమ కారుల ఆకాంక్షలు నెరవేర్చాలంటే బీజేపీతోనే సాధ్యం అంటూ స్పష్టం చేసారు. దీంతో తెలంగాణ ఉధ్యమ కారులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ కార్యాచరణ మొదలు పెట్టింది.
ఇందుకు జూన్ 2వ తేదీన ఉధ్యకారులతో తెలంగాణ ఉధ్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ సభను నిర్వహించాల నిర్ణయించింది. ఇందుకు తెలంగాణ ఉధ్యమ కారుడు జిట్టా బాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేసింది రాష్ట్ర నాయకత్వం. ఈ సమావేశంలో తెలంగాణలో ఉధ్యమ కారులను పాల్గొనేలా ప్రయత్నం చేస్తోంది.
సుమారు 1700మంది ఉద్యమ కారులతో ఏర్పాటు చేయబోయే సమావేశం ద్వారా రాష్ట్రంలో బీజేపీతోనే తెలంగాణ ఉధ్యమ ఆకాంక్షలు నెరువెరుతాయన్న సంకేతం ఇవ్వబోతున్నారట బీజేపీ నేతలు. మరి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది.. పార్టీ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా.. ఉద్యమ ఆకాంక్షల సధన సభ ఆ పార్టీకి ఏమేరకు బూస్టప్ ఇస్తుందో వేచి చూడాలి.